సమష్టి కృషితో ఉత్పత్తి సాధించాలి
అధికారులు, కార్మికులు సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ విభాగాలకు చెందిన ముఖ్యఅధికారులతో సమీక్షా సమావేశం ని
- డైరెక్టర్ (ఆపరేషన్) శ్రీనివాస్
- ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్య అధికారులతో సమీక్ష
రామగిరి, ఫిబ్రవరి 4 : అధికారులు, కార్మికులు సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ విభాగాలకు చెందిన ముఖ్యఅధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తిలో రక్షణ చర్యలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. చిన్న తప్పిదాలతో పెద్ద ప్రమాదాలు పొంచి ఉంటాయని పేర్కొన్నారు. పనిస్థలాల వద్ద తగిన రక్షణ సూత్రాలు పాటించి, బొగ్గు ఉత్పత్తి చేయాలని శ్రీనివాస్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్జీ-3 జీఎం వెంకటేశ్వరరావు, ఏరియా ఇంజినీర్ ఎలీషా, జీఎం ఫైనాన్స్ శ్రీనివాస్, డీజీఎం ఐఈడీ చంద్రశేఖర్, ఎస్ఈ సివిల్ పద్మరాజు పాల్గొన్నారు.
ఆర్జీ-2 ఏరియాలో..
రాబోయే రెండు నెల్లలో వార్షిక లక్ష్యాలను సాధించాలని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-2 ఏరియా జీఎం కార్యాలయంలో మాట్లాడారు. సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఏరియాకు రావడంతో అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం డివిజన్ ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓసీపీ-3 కృషిభవన్లో ఉన్న అమ్మవారిని దర్శించుకొని వ్యూ పాయింట్ ద్వారా పని స్థలాలను పరిశీలించి మాట్లాడారు. ఏరియా జీఎం ఐత మనోహర్ అధ్యక్షతన చేపట్టిన సమావేశంలో ఎస్వోటూ జీఎం అబ్దుల్ సలీం, పీవో మోహన్ రెడ్డి, వీకేపీ పీవో కాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏరియా ఇంజినీర్ నర్సింహరావు, ఏరియా రక్షణాధికారి బీ రవీందర్, పీఈ దుర్గాప్రసాద్, సివిల్ డీజీఎం ధనుంజయ్, డీజీఎం(ప) జీ రాజేంద్రప్రసాద్, డీజీఎం(ఐఈడీ) మురళీకృష్ణ, మేనేజర్ రమేశ్, ఫైనాన్స్ మేనేజర్ ధనలక్ష్మీబాయి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఎస్టేట్స్ అధికారులు సునీత, సురేశ్బాబు, ఎస్ఎస్వో పీవీ రమణలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

