కారేపల్లి, జూలై 24 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని కారేపల్లి తెలంగాణ మోడల్ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా గురువారం సందర్శించారు. ముందుగా పాఠశాల భవనాన్ని, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి పాఠశాల ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల గురించి, మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు.
ఆమె వెంట డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలాస్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ, డిప్యూటీ డైరెక్టర్లు మదన్ మోహన్, డిడి రాజీవ్, డిప్యూటీ డైరెక్టర్ వెంకట నరసయ్య, వరంగల్ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) సత్యనారాయణ రెడ్డి, ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, ఏఎంఓ మంజరి, రామకృష్ణ,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, కేజీబీవీ ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య ఉన్నారు.
Karepalli : ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కారేపల్లి మోడల్ స్కూల్ సందర్శన