భద్రాచలం, జనవరి 21: భద్రాచలం సీతారామచంద్రస్వామికి సికింద్రాబాద్ బోయినపల్లికి చెందిన అబ్బరాజు లక్ష్మి, అపర్ణ-విజయ్ దంపతులు బంగారు లాకెట్‌ను స్వామి వారికి ఆదివారం బహూకరించారు. ముత్యాలు, కెంపు, బంగారు గుండ్లతో చేయించిన ఈ లాకెట్ విలువ రూ. 1.58 లక్షలు.
వారు ముందుగా స్వామి వారిని దర్శించుకుని, అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలను సందర్శించి తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఆ తరువాత దేవస్థానం ఈవో ఎల్ రమాదేవికి లాకెట్‌ను అందజేశారు.