మధిర, ఏప్రిల్ 24 : మధిర సివిల్ కోర్టు జడ్జిగా ఎన్. ప్రశాంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ మెట్రో పాలిటన్ కోర్టు నుండి బదిలీపై ఆమె మధిర సివిల్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మధిర కోర్టు ఇన్చార్జి జడ్జిగా వ్యవహరించిన ఎస్కే మీరా కాసీం సాహెబ్ నుండి బాధ్యతలు అప్పగించారు. మధిర బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఇరువురు న్యాయమూర్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు, న్యాయవాదులు పాల్గొన్నారు.