ఖమ్మం :బాధితులకు భరోసా కల్పించేందుకు ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి… సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమం సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తి గత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.