కారేపల్లి, జూలై 10 : కారేపల్లి అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చింతల వజ్రం కారేపల్లి పోస్టాఫీస్ లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె ఇటీవల మృతి చెందటంతో ఆర్పీఎల్ఐ పాలసీ క్లెయిమ్ మొత్తం రూ.2,19,000/- నామినీ, భర్త చింతల శ్రీనుకు సబ్ పోస్ట్ మాస్టర్ కె.ప్రశాంత్, ఏజెంట్ ఎండీ.రియాజ్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ ద్వారా అనేక సేవలు అందించడం జరుగుతుందన్నారు. అనేక పొదుపు పధకాలు, బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు పోస్టల్ శాఖ ద్వారా పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు.