జూలూరుపాడు, డిసెంబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండబోడు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా బరిలో నిలిచిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గడిగ సింధు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. నల్లబండ బోడు గ్రామ పంచాయతీలో 144 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 139 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బచ్చల ఝాన్సీరాణి కి 69 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి గడిగ సింధుకి 70 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలుపొందింది. దీంతో ఆమె మద్దతుదారులు గ్రామంలో సంబరాలు నిర్వహించారు.