Khammam | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మందిపై కేసులు నమోదు
Khammam | ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం కారేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.
Khammam | కారేపల్లి, జూలై 27 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం కారేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 6 మోటార్ సైకిళ్లు, 9 సెల్ఫోన్లతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి ఎస్సై బైరు గోపి ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ సమీపంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసరాల్లో పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఇల్లందుకు చెందిన 12 మంది వ్యక్తులు పేకాడుతూ దొరికారు. వారి వద్ద నుండి 6 మోటార్ సైకిళ్ళు 9 సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ. 26,900ల నగదు పట్టుకున్నారు.దీనికి సంబంధించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.గోపి తెలిపారు .ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు భూక్య శంకర్, హరి, ఓంకార్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

