ఖమ్మం, జూన్ 27 : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యే యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముసాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వివిధశాఖల అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి, సమస్యను పరిషరించడం వంటి లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాలని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో ఎకడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ ముసాన్లో భాగంగా ప్రతి ఏటా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించడం జరుగుతుందన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, సత్యనారాయణ, విజయభాసర్‌రెడ్డి, టి.విష్ణు వందన, డాక్టర్ చందన, అనిత, స్వామి పాల్గొన్నారు.