మధిర, మార్చి 19 : ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వైద్యం ఒక వరమని ఫిజియోథెరపీ వైద్యురాలు జి.వసంత అన్నారు. బుధవారం చింతకాని మండల పరిధిలోని లచ్చగూడెం ఉన్నత పాఠశాలలో ఫిజియోథెరపీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంత మాట్లాడుతూ… వివిధ రకాల శారీరక వైకల్యం, పాక్షిక పక్షవాతం వంటి సమస్య ఉన్నవారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దివ్యాంగ బాల, బాలికల భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మండలంలోని వివిధ గ్రామాల నుండి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నబాలబాలికలను తల్లిదండ్రులు ఈ శిబిరానికి తీసుకురావాలన్నారు. అనంతరం పిల్లలకు ఫిజియోథెరపీ చేసి తల్లిదండ్రులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ నరేశ్, లచ్చగూడెం అంగన్వాడి టీచర్లు గూని రమాదేవి, వి.మనోహరి, భవితా కేంద్రం నిర్వాహకులు కే.ఎస్.కృష్ణారావు, ఐఆర్పీ భూక్యా దస్లి , భవిత కేంద్రం కేర్ గివింగ్ వాలంటీర్ లలితకుమారి పాల్గొన్నారు.