ఖమ్మం, ఫిబ్రవరి 3: నగరంలోని ప్రతి వీధినీ, ప్రతి రోడ్డునూ సీసీ రోడ్డుగా నిర్మిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్లో రూ.14.20 లక్షలతో నిర్మించిన వీడీఎఫ్ రోడ్డును, 36వ డివిజన్లో రూ.1.42 కోట్లతో నిర్మించిన వీడీఎఫ్ రోడ్డును మేయర్ నీరజతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలోని అన్ని రోడ్లనూ సీసీ రోడ్లుగా మారుస్తామని, ముందస్తుగా ప్రస్తుతం 140 రోడ్లను అధునాతన పద్ధతిలో వీడీఎఫ్ రోడ్లుగా నిర్మిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 80 రోడ్లు పూర్తయ్యాయని వివరించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రోజ్లీనా, రామ్మోహన్రావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, గుత్తా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.