పాలేరు ప్రజలు సుభిక్షంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
పాలేరు ప్రజలంతా పాడిపంటలు, సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సీతారామచంద్రస్వామిని వేడుకున్నట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన భార్య కందాల విజయమ్మతో కలిసి ఆలయ కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు..
ఖమ్మం రూరల్, జూన్ 30 : పాలేరు ప్రజలంతా పాడిపంటలు, సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సీతారామచంద్రస్వామిని వేడుకున్నట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన భార్య కందాల విజయమ్మతో కలిసి ఆలయ కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఏదులాపురం గ్రామంలోని శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయం నాల్గొవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కందాల దంపతులకు ఘన స్వాగతం పలికారు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ తో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని, ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. పడమటి తండా, గుర్రాలపాడు, తల్లంపాడు, పొన్నెకల్లు తదితర గ్రామాలలో పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో మరణించిన పలువురు వ్యక్తుల కుటుంబాలను కలిసి మరణించిన వ్యక్తుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుల కుటుంబాల సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు పార్టీ, తాను అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల, మున్సిపాలిటీ పరిధిలో ఆయ వార్డులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పాలేరు ప్రజలు సుభిక్షంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

