ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి జనం ఉవ్వెత్తున కదలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు మెడలో కండువా.. చేతిలో గులాబీ జెండాతో స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణమంతా గులాబీ వనాన్ని తలపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం అప్పారావుపేటలో సోమవారం సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ నియోజకవర్గ ప్రజల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది.
సభలో యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్..’ అంటూ నినాదాలు చేశారు. అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.