మధిర, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధిర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి దీప్తివేముల యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగా అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందన్నారు. యోగా చేసిన వారికి ప్రశాంతత, ఆలోచన శక్తి వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా శిక్షణ తీసుకోవాలని పేర్కొన్నారు.