– సీనియార్టీ ప్రాతిపాదికన బాధ్యతలు
– రాష్ట్ర సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ కె నారాయణ రావు ఉత్తర్వులు జారీ
ఖమ్మం రూరల్, డిసెంబర్ 04 : ఇంతకాలం పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పంచాయతీ సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలను మున్సిపాలిటీ పరిధిలోకి బదలాయిస్తూ రాష్ట్ర సీడీఎంఏ కమిషనర్ కె.నారాయణ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన క్రమంలో తాత్కాలికంగా పంచాయతీ సెక్రటరీలు మున్సిపల్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోకి విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన సెక్రటరీలను మున్సిపాలిటీ పరిధిలోకి బదలాయించారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోకి 9 మంది పంచాయితీ సెక్రటరీలను బదలాయించడం జరిగింది.
ప్రస్తుతం వారి సీనియారిటీకి అనుగుణంగా మున్సిపాలిటీలో హోదాలో కల్పించారు. గ్రేడ్ వన్ సెక్రటరీ కె.శ్రీధర్ రెడ్డిని, రెవెన్యూ ఆఫీసర్గా గ్రేడ్ 2 సెక్రటరీగా ఉన్న పిల్లి శ్రీనివాస్, నల్లబెల్లి రఘులను సెక్షన్ ఆఫీసర్లుగా, గ్రేడ్ 3 సెక్రటరీ ఏదునూతల సువర్ణ, ఉమా జూనియర్ అసిస్టెంట్ గా, గ్రేడ్ 4 సెక్రటరీలైన కొక్కుల నరేశ్, దామల కిరణ్, ధారావత్ శిరీష, పగిడిపల్లి ఉషారాణి, కేలావత్ మధు వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లుగా అవకాశం కల్పించారు. మొత్తం తొమ్మిది మంది మున్సిపాలిటీ పరిధిలోకి రాగా మిగిలిన సెక్రటరీలు కొద్ది రోజుల్లో ఇతర పంచాయతీ సెక్రటరీలుగా బదిలీ కానున్నారు.