పాల్వంచ, మే 25 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతోందని మండిపడ్డారు. పెరిగిన ఇంధన ధరలతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తులసీరాం, దొడ్డ రవికుమార్, సత్య, సత్యవాణి, వింజ రాములు, దాసరి శంకరన్న, యాకోబు, రెహమాన్, మౌలాన, కుమారి, సోమయ్య పాల్గొన్నారు.