ఆడబిడ్డలకు సర్కారు కానుక
ఆడబిడ్డలకు టీఆర్ఎస్ సర్కారు పంపిన కానుక బతుకమ్మ చీరె అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెలను కూసుమంచి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహిళలకు పంపిణీ చేశారు.
- మహిళలకు ప్రభుత్వమే సారె పంపడం గొప్ప విషయం
- మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
- బతుకమ్మ చీరెల పంపిణీలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి
కూసుమంచి/ ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 23: ఆడబిడ్డలకు టీఆర్ఎస్ సర్కారు పంపిన కానుక బతుకమ్మ చీరె అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెలను కూసుమంచి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తోందని, బతుకమ్మ చీరెలను మహిళలందరికీ అందిస్తోందని అన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి శేఖర్, బాణోత్ శ్రీనివాస్, ఇంటూరి బేబి, మీనన్, వేముల వీరయ్య, చాట్ల పరశురాం, మల్లీడి వెంకటేశ్వరరావు, మోదుగు వీరబద్రం, అద్దంకి ఉపేంద్రాచారి, అలీ, కొక్కిరేణి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం..
టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. ఆయా గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, పింఛన్ మంజూరు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ సర్కారు కానుకగా చీరె సారెను పంపడం గొప్ప విషయమని అన్నారు. కాగా, ఆయా గ్రామాల పొలిమేరల్లో ఎమ్మెల్యే కందాళకు ఆయా గ్రామాల మహిళలు, గ్రామస్తులు పూలతో స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు బెల్లం ఉమా, యండపల్లి వరప్రసాద్, బెల్లం వేణుగోపాల్, గూడ సంజీవరెడ్డి, ఏ.వెంకన్న, ముత్యం కృష్ణారావు, జర్పుల లక్ష్మణ్‌నాయక్, సుమా, అశోక్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

