కారేపల్లి, ఏప్రిల్ 07 : గత పదేండ్లుగా గ్రామ పంచాయతీకి రావాల్సిన బకాయిలు ఉండడం వల్ల కారేపల్లి వారాంతపు సంత నిర్వహణను నిలిపి వేస్తున్నట్లు సింగరేణి గ్రామ పంచాయతీ కార్యదర్శి నెహ్రూ మంగళవారం ఒక ప్రకటకంలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సొంత నిర్వాహకులు పంచాయతీకి పన్ను చెల్లించడం లేదన్నారు. అనేకసార్లు గ్రామ పంచాయతీ నుండి నోటీసులు జారీ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై పంచాయతీ పాలకవర్గం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ నెల 12 నుండి సంత నిర్వహణ పూర్తిగా నిలిపి వేస్తున్నట్టు పేర్కొన్నారు.