కారేపల్లి, జూలై 18 : ఓపెన్ స్కూల్ విద్యను చదవడం, రాయడం వచ్చిన వారు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజు అన్నారు. మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం ఓపెన్ స్కూల్ 2025 -26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకై దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
చదువులను మధ్యలో నిలిపివేసిన వారు పదో తరగతి పాసై, ఇంటర్ చదవని వారికి ఓపెన్ స్కూల్ విద్య ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ మండల కో ఆర్డినేటర్ పి.రామారావు, సెంటర్ కో ఆర్డినేటర్ మహమ్మద్ నజీర్, ఉపాధ్యాయులు సాదిక్ పాషా, సుందర్, లక్ష్మణరావు, పరమేశ్ పాల్గొన్నారు.