రేపటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్‌ల్లో పరీక్షలు జరగనున్నాయి.
- టెన్త్‌కి 1,594 మంది, ఇంటర్‌కి 1,755 మంది విద్యార్థులు
- ఖమ్మం నగరంలో 8 కేంద్రాలు
ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 18 : తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్‌ల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు ఖమ్మం నగరంలో 8 కేంద్రాలను ఎంపిక చేశారు. టెన్త్‌కి 1,594మంది, ఇంటర్‌కు 1,755 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.
టెన్త్ పరీక్ష కేంద్రాలు..
గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మాంట్‌ఫోర్ట్ హైస్కూల్, ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోమినాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ హైస్కూల్ ఉన్నాయి.
ఇంటర్ పరీక్ష కేంద్రాలు…
రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రోటరీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాండురంగాపురం జడ్పీ హైస్కూల్, ఖాజీపుర ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జలగంనగర్ జడ్పీ హైస్కూల్ ఉన్నాయి.
సెల్‌ఫోన్ అనుమతి లేదు..
పరీక్ష కేంద్రాల్లోకి ఎవ్వరికి ఫోన్ అనుమతి లేదని, పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో చైతన్యజైని స్పష్టం చేశారు. పరీక్ష ప్రారంభమైన 5నిమిషాల తర్వాత అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కోఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు 9440728543, కంట్రోల్ రూమ్ నెంబర్ 8008403522లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

