దమ్మపేట, మార్చి 1 : అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి శనివారం సందర్శించారు. పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం జరుగుతున్న మెయింటెనెన్స్ పనులు, సివిల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రస్తుతం ఫ్యాక్టరీ షట్డౌన్లో ఉన్నందున చేపట్టిన పనుల పురోగతి గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్‌లో ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా చేపట్టిన పనుల పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్, సిబ్బంది ఉన్నారు.