ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలో క్షుద్ర పూజల స్థానికంగా కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గాజు సీసాలను పగలకొట్టి క్షుద్ర పూజలు చేసినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గులు వేయటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్షుద్ర పూజలు చేయడం జనాలను ఆందోళనకు గురి చేశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.