జూలూరుపాడు, మార్చి 10: ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ శిరీష అన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆమె సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ, రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరిగేలా వైద్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. వైద్యులు శ్రీధర్, గీత, సీహెచ్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.