చింతకాని, డిసెంబర్ 30: చింతకాని, బోనకల్ మండల పరిధిలో సాగర్ ఆయకట్టు గ్రామాల రైతుల చివరి పొలాలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని, సాగునీటిని వృథా చేయవద్దని సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్లు నర్సింగరావు, ఆనంద్‌కుమార్ అన్నారు. మండలంలోని ప్రొద్దుటూరు గ్రామ సమీపంలో ఎన్నెస్పీ కాలువ ప్రవాహం, నీటి విడుదలను శుక్రవారం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు రెండు మండలాల రైతుబంధుసమితి స భ్యులతో ఆయా గ్రామాల సాగునీటి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల అవసరాన్ని బట్టి సాగునీటి విడుదలను పెంచుతామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్ర కారం సాగర్ కాల్వల ద్వారా నిరంతరం సాగునీరు అం దిస్తామని, రైతులెవ్వరూ అధైర్యపడొద్దని తెలిపా రు. కార్యక్రమంలో బీబీసీ కాలువ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, రైతుబంధుసమితి సభ్యులు పెంట్యాల పుల్ల య్య, వేమూరి ప్రసాద్, గడ్డం శ్రీనివాసరావు, పెంట్యాల సైదేశ్వరరావు, వేముల నర్సయ్య, ఎన్నెస్పీ జేఈలు తొంటి సురేశ్, సతీశ్, వర్క్ఇన్స్పెక్టర్లు టీ కృష్ణప్రసాద్, లస్కర్లు, ఎన్నెస్పీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
రైతులు సాగు చేస్తున్న పంటలకు కావాల్సిన సాగునీటి సరఫరాపై బీబీసీ కెనాల్‌ను ఖమ్మం, కల్లూరు ఎస్ఈలు నర్సింగ్‌రావు, ఆనంద్‌కుమార్, పాలేరు ఈఈ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఇటీవల ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు యాసంగి పంటల సాగుకు సాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నెస్పీ కెనాల్ పరిధిలోని రైతులకు నిరంతరం సాగునీటిని అందించాలని, సాగునీటి సరఫరాపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నోడల్ అధికారులుగా ఖమ్మం, కల్లూరు, పాలేరు ఎస్ఈలను సీఈ శంకర్‌నాయక్ నియమించారు. ఈ సందర్భంగా సాగర్ మెయిన్ కెనా ల్ నుంచి బీబీసీ కెనాల్ వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారులు మాట్లాడుతూ బీబీసీ కెనాల్ పరిధిలోని రైతులు ఏ పంటలు సాగు చేశారు, ఎన్ని ఎకరాల్లో సాగవుతున్న విషయాన్ని ఇరిగేషన్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. కేవలం బీబీసీ పరిధిలోని రైతులకు మాత్రం చివరి ఆయకట్టు రైతు వరకు నీటిని సరఫరా చేసేందుకు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. బీబీసీ పరిధిలో 85 వేల ఎకరాల పంట సాగులో ఉన్నాయని, ఈ మేరకు నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోనకల్లు, మధిర, చింతకాని డీఈలు శ్రీనివాసరావు, నాగబ్రహ్మం, రాంప్రసాద్, జేఈలు రాజేశ్, సురేశ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ పాల్గొన్నారు.