కారేపల్లి, ఆగస్టు 22 : సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి షాదీఖానా నూతన కమిటీని నియమిస్తూ ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. షాదీఖానా కమిటీ చైర్మన్ గా మహమ్మద్ యాకుబ్ అలీ, వైస్ చైర్మన్ గా షేక్ మజీద్ పాషా, కార్యదర్శిగా ఎండి సల్మా, సభ్యులుగా షేక్ యాకుబ్ పాషా, షేక్ ఖదీర్ నియామకమయ్యారు. అందుకు సంబంధించిన నియామక ప్రతులను తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో బి.పద్మ కు నూతన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ మేదరి తోని ఇతర నాయకులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

కారేపల్లి షాదీఖానా నూతన కమిటీ