పాల్వంచ రూరల్, ఏప్రిల్ 30: భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భవిషత్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు. మండలంలోని జగన్నాథపురంలో బుధవారం జరిగిన భూభారతి అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రానున్న తరాలకు కూడా ఎటువంటి భూ సమస్యలు ఉండవని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. త్వరలో పాల్వంచ కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల కర్మాగార నిర్మాణం జరుగుతుందని, మున్సిపల్ కార్పొరేషన్ కావడం వల్ల పాల్వంచ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కూడా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని అన్నారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, ఆర్డీవో మధు, తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.