‘భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నాం. రూ.1.20 కోట్ల వ్యయంతో భక్తజనులు మెచ్చేలా భద్రాచలం, పర్ణశాలలో ఏర్పాట్లు చేస్తున్నాం. నవంబర్ 22వ తేదీ నుంచి భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లను అందుబాటులో ఉంచాం. భక్తుల రద్దీకి అనుగుణంగా 2 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నాం. తెప్పోత్సవం రోజున మిరుమిట్లు గొలిపే విధంగా రూ.6 లక్షల విలువ చేసే పటాకులు కాల్చనున్నాం’ అని భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ‘నమస్తే’కు మంగళవారం తెలిపారు. 17,468 చదరపు అడుగుల్లో వెదురు తడికలతో, చాందినీ వస్ర్తాలతో సర్వాంగ సుందరంగా వివిధ రకాల అలంకరణలు చేపట్టామని, భారీగా తరలివచ్చే సామాన్య భక్తుల కోసం ఉచిత వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. బుధవారం నుంచి పగల్‌పత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆమె వివరించారు.
భద్రాచలం, డిసెంబర్ 12 : ‘భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. అందరూ స్వామివారి కార్యక్రమాలను తిలకించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం’ అని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ‘నమస్తే’కు మంగళవారం తెలిపారు. రూ.1.20 కోట్ల వ్యయంతో వైకుంఠ ఏకాదశికి భద్రాచలం, పర్ణశాలలో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
ఈవో : నవంబర్ 22వ తేదీ నుంచి భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లను అందుబాటులో ఉంచాం. మొత్తం ఏడు సెక్టార్లుగా ఏర్పాటు చేశాం. 4,200 టికెట్లు విక్రయించేందుకు చర్యలు చేపట్టాం. ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు విక్రయిస్తున్నాం. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి తానీషా కల్యాణ మండపం వద్ద, రామాలయం దగ్గర ఉన్న ఆటోస్టాండ్ వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి సెక్టార్లలోకి వెళ్లేందుకు టికెట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. 17,468 చదరపు అడుగుల్లో వెదురు తడికలతో, చాందినీ వస్ర్తాలతో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేపట్టాం. భారీగా తరలివచ్చే సామాన్య భక్తుల కోసం ఉచిత వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం. వారి కోసం 46,332 చదరపు అడుగుల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశాం. 10X20 సైజు ఎల్ఈడీ స్క్రీన్స్‌తో ఒక మొబైల్ ఎల్ఈడీ వ్యాన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం.
ఈవో : ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. రద్దీకి అనుగుణంగా 2 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నాం. భక్తులు ఇబ్బంది పడకుండా ఏడు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నాం. నందిని రెసిడెన్సీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలని గతంలో కంటే అన్నింటికీ అధికంగా వెచ్చిస్తున్నాం. తెప్పోత్సవం రోజున మిరుమిట్లు గొలిపే పటాకులు కాల్చనున్నాం. పటాకులను రూ.6లక్షలు వెచ్చించి తెప్పిస్తున్నాం.
ఈవో : ఏర్పాట్లన్నీ 75 శాతం పూర్తయ్యాయి. స్వాగత ద్వారాలు, లైటింగ్, రంగులు, పండాల్స్, చలువ పందిళ్లు ఇలా అన్ని దాదాపు పూర్తికావొచ్చాయి. పర్ణశాలలో కూడా తెప్పోత్సవం నదిలోనే నిర్వహిస్తున్నాం. భద్రాచలంలో ఎలా అయితే ఉత్సవ ఏర్పాట్లు ఉన్నాయో.. పర్ణశాల రామాలయంలో కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భక్తులు అక్కడకు కూడా 60 శాతం మంది వరకు వెళ్తుంటారు. అందుకే అక్కడ ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.
ఈవో : ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఎవరు అలా చేస్తున్నారో గమనించేందుకు సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నాం. కెమెరాల సాయంతో సెక్టార్లలోకి వచ్చిన వారిని బయటకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సెక్టార్ల వద్ద రెగ్యులర్ వాళ్లను కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తాం.
ఈవో : బుధవారం నుంచి పగల్‌పత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నాం. పగల్‌పత్తు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేవలం తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నాం.
ఈవో : ఆహ్వాన పత్రికలు మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేలకు మాత్రం అందజేశాం. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు. త్వరలోనే అపాయింట్మెంట్ తీసుకొని మరోసారి హైదరాబాద్ వెళ్లి అందజేస్తాం. కలెక్టర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశాం. ఇంకా ఎస్పీకి ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు, తాజా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అందజేశాం.