‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన ఆటో షో అదుర్స్ అనిపించింది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవారికి అన్ని షోరూంలు తిరిగి సమయాన్ని వృథా చేసుకోకుండా నచ్చిన, మెచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలిగింది. వాహన ప్రియులు సరికొత్త మోడళ్లతో కూడిన కార్లు, ద్విచక్ర వాహనాల స్టాళ్లను సందర్శించి కంపెనీ ప్రతినిధులను రేటు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కొందరు అక్కడికక్కడే వాహనాలను బుక్ చేసుకున్నారు. ఆటో షోను ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ప్రముఖ విద్యాసంస్థల యజమాని గుండాల(ఆర్జేసీ) కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల కిరణ్ తదితరులు ప్రారంభించారు. ఆదివారం కూడా ఆటో షో కొనసాగనున్నది.
– ఖమ్మం వ్యవసాయం/రఘునాథపాలెం, నవంబర్ 23
ఖమ్మం జిల్లా, నగర ప్రజల సౌకర్యార్థం వివిధ రకాల కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాల నూతన మోడళ్లను ఒకే వేదికపైకి చేర్చి ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ప్రతియేడు ఆటో షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నగరవాసుల చెంతకు శనివారం మరోమారు ఆటో షోను తీసుకొచ్చింది.
మీడియా పార్టనర్ టీ న్యూస్, డిజిటల్ మీడియా పార్టనర్‌గా సుమన్ టీవీ సహకారంతో ఏర్పాటు చేసిన ఆటో షోకు విశేష స్పందన లభించింది. ఆటో షోను ప్రారంభించిన అనంతరం ముఖ్యఅతిథులు వివిధ స్టాళ్లను నిశితంగా పరిశీలించారు. ఆయా వాహన కంపెనీలతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకు స్టాళ్లను సందర్శించి వాహనాలకు ఇచ్చే రుణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు చెందిన కార్లను స్వయంగా, సరదాగా నడిపి వాటిలోని ప్రత్యేకతల గురించి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఆటో షోను సందర్శించిన సందర్శకులకు ప్రోత్సాహకంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా లక్కీడిప్‌లను ఏర్పాటు చేసింది. మేళాను తిలకించేందుకు వచ్చిన అనేక మందికి నిర్వాహకులు ఉచితంగా అందించిన రశీదులలో తమ పేర్లు, వివరాలను రాసి అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్‌లలో వేశారు. అనంతరం ప్రతి గంటకు ఒకసారి ఆటో షోకు హాజరైన అతిథుల చేతులమీదుగా డ్రా తీసిన వెంటనే అక్కడికక్కడే విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతో సందర్శకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
దీంతోపాటు ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు సంబంధించిన నిపుణ స్టాల్‌ను సందర్శించి ఆసక్తిగా తిలకించారు. అంతేకాక పత్రిక వార్షిక చందాదారులుగా చేరడానికి సైతం తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. ఒకవైపు వివిధ కంపెనీలకు చెందిన సరికొత్త మోడళ్లలో కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటు రుణ సదుపాయం నిమిత్తం అక్కడే బ్యాంకు స్టాల్స్ ఉండడంతో కొందరు సందేహాలను నివృత్తి చేసుకోగా.. మరికొందరు వాహనాలను అప్పటికప్పుడే బుక్ చేసుకున్నారు. ఏదేమైనా హైదరాబాద్, ముంబాయి, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన ఆటో షోను నగరవాసులకు చేరువ చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. షోలో తమకు అవకాశం కల్పించిన స్టాల్స్ నిర్వాహకులు ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆటో షో ఆదివారం సాయంత్రంతో ముగియనున్నదని నమస్తే తెలంగాణ ఖమ్మం యునిట్ మేనేజర్ రేన రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆటో షో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఆసక్తి కలిగిన నగరవాసులు, ఉమ్మడి, పొరుగు జిల్లా ప్రజలు నేరుగా షోను సందర్శించి ఇష్టమైన వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో వాహనాలను కొనుగోలు చేసే వారు సైతం ముందస్తుగా బుక్ చేసుకునేందుకు షో ద్వారా అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదివారం కూడా లక్కీడిప్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కాగా.. ఆటో షోకు హాజరై స్టాళ్లను పరిశీలించిన ముఖ్యఅతిథులు, సందర్శకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానం వేదికగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షో ఓ అద్భుతమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడుతూ సొంత కారు, బైక్ కలను సాకారం చేసుకునే వారి కోసం ఏర్పాటు చేసిన ఆటో సంస్థల ప్రదర్శన వాహనప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన జీవనాన్ని ప్రతి కుటుంబం కోరుకుంటున్న తరుణంలో ఇటువంటి వేదికలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ‘నమస్తే తెలంగాణ’ ఇటువంటి షోలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మంతోపాటు హైదరాబాద్, వరంగల్ జిల్లాకు చెందిన అన్నిరకాల కంపెనీలను ఒకేచోట కలిసి ప్రదర్శనగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఒకే వేదికగా అనేక ఆటో సంస్థలతో షో నిర్వహించడం ద్వారా ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని పరిశీలించి మరీ కొనుగోలు చేసుకునేందుకు చక్కటి అవకాశంగా వారు పేర్కొన్నారు. ఇదే వేదికగా బ్యాంకర్లను సైతం అందుబాటులో ఉంచి వాహనం కొనుగోలు చేసిన వారికి రుణ సదుపాయం కల్పించడం మంచి నిర్ణయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారుడి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఆటో షోను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలుదారుల కోసం రుణ సౌకర్యం కల్పించారని, అనువైన వాయిదాల్లో రుణం చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. కేవలం ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఈ ఆటో షోలు ‘నమస్తే తెలంగాణ’ వాహనప్రియులకు చేరువ చేస్తున్నట్లు చెప్పారు.
– ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోలో వివిధ రకాల మోడళ్లకు చెందిన కార్లు, బైక్‌లు కొలువుదీరాయి. మహావీర్ స్కోడా, కియా, సిట్రోయెన్ ప్రైడ్ మోటార్స్, ప్రైడ్ జీప్, స్పార్క్ హీరో, టాటా మోటార్స్, కాకతీయ టయోటా, వెంకటరమణ బజాజ్, మహీంద్రా కటకం హోండా, గ్రీన్ హోండా కంపెనీలకు చెందిన అన్నిరకాల వాహనాలు అందుబాటులో ఉంచాయి. అధునాతన హంగులు, అధునాతన సౌకర్యాలు ప్రత్యేక ఆఫర్లతో ఆయా సంస్థలకు చెందిన కార్లు, బైక్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
వీటితోపాటు వాహనాలకు రుణాలు ఇచ్చేందుకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఆటో షోలో పాల్గొన్నాయి. టీవీ పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్టనర్‌గా ఎస్ టీవీ వ్యవహరించాయి. కార్యక్రమంలో ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, నమస్తే తెలంగాణ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ రేన రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణు, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, సర్యులేషన్ మేనేజర్ రాంబాబు, యాడ్ ఆఫీసర్లు నాగరాజు, సురేందర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, సురేశ్, కరుణాకర్, దశరథ్, రిపోర్టర్లు శీలం శ్రీనివాసరావు, బోయిన కృష్ణ, పునాటి మనోజ్, గోపాలరావు, లక్ష్మణ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆటో ఎక్స్‌పోలో మా కంపెనీ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన షోలో మా స్టాల్‌కు మంచి ఆదరణ కనిపించింది. చాలా మంది యువకులు, నగరవాసులు కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఇప్పటికే కంపెనీకి ఉన్న వంటి ప్రాముఖ్యతతో చాలా మంది స్టాల్‌ను ఆశ్రయించారు. ఇలాంటి షో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు థ్యాంక్స్.
-అందె అప్పారావు, సేల్స్ మేనేజర్, వెంకటరమణ ఆటోమొబైల్స్
తక్కువ సమయంలో అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కల్పించడం మా బ్యాంకు ప్రత్యేకత. మా బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్‌కు ఆటో ఎక్స్‌పోలో ఆశించిన ఆదరణ రావడం చాలా హ్యాపీగా ఉంది. మా బ్యాంకు కల్పిస్తున్న అనేక సేవలను తెలుసుకునేందుకు నగరవాసులు చాలా మాంది సంప్రదించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-బి.లింగరాజు, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఎస్బీఐ
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోఎక్స్పోలో మా స్టాల్‌ను అనేక మంది యువకులు, వ్యాపారులు సందర్శించడం సంతోషంగా ఉంది. మార్కెట్లో మహీంద్ర కంపెనీకి ఎంతో క్రేజ్ ఉన్నందున మా వాహనాలను టెస్టు రైడ్ చేశారు. కంపెనీకి ఉన్న ఆదరణకు తోడు ఎక్స్‌పోలో మాకు అవకాశం రావడం సంతోషకరం.
యూనియన్ బ్యాంకు అంటేనే నమ్మకానికి చిరునామా. ఏ బ్యాంకు ఇవ్వని విధంగా అతి తక్కువ వడ్డీ రేట్లతో వాహనాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. వాహనం కొనుగోలు చేసిన ధరలో 90 శాతం రుణ సదుపాయం ఇస్తున్నాం. వినియోగదారులకు రుణ సదుపాయం కోసం మా బ్యాంకు స్టాల్‌కు అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది.
– శివకుమార్, మేనేజర్, యూనియన్ బ్యాంకు
రైతులకు పంట రుణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఇతర వాహనాలకు సైతం తక్కువ వడ్డీ రేట్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే ఖాతాదారులకు పూర్తిస్థాయిలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. నమస్తే తెలంగాణ ఆటో ఎక్స్పో ప్రదర్శనలో మా బ్యాంక్ స్టాల్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది.
-బి.రామకృష్ణ, కెనరా బ్యాంకు మేనేజర్
కారు తయారీలలో స్కోడా కంపెనీకి ప్రత్యేకత ఉంది. స్కోడా కంపెనీ నుంచి వచ్చిన అనేక మోడల్ వాహనాలకు మార్కెట్లో వినియోగదారుల నుంచి గొప్ప ఆదరణ వస్తోంది. మా స్టాల్‌కు తొలిరోజు జిల్లావాసుల నుంచి ఎంతో ఆదరణ లభించింది. దాదాపు 50 మంది వినియోగదారులు మమ్మల్ని ఆశ్రయించారు. ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
-విజయ్ శేఖర్, సేల్స్ కన్సల్టెంట్ మహావీర్ స్కోడా
సిట్రోయెన్ కంపెనీ వాహనాలకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. సీట్రో కంపెనీ వాహనాన్ని నగర మేయర్ నీరజ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తోపాటు ఇతర ప్రముఖులు టెస్టు డ్రైవ్ చేశారు. షోలో మా కంపెనీ వాహనాలకు మంచి ఆదరణ లభించింది. కొందరు అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆటో షో నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-మహ్మద్ హర్షద్, టీం లీడర్, సిట్రోయెన్ ఫ్రైడ్ మోటార్స్
అన్ని రకాల కంపెనీలను ఒకే వేదిక వద్దకు చేర్చి వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించే ఆలోచన చేయడం సంతోషదాయకం. బ్యాంకులు స్టాల్స్‌ను ఏర్పాటు చేయడంతో రుణ సదుపాయం గురించి తెలుసుకునేందుకు అవకాశం కలిగింది. మార్కెట్లో కాకతీయ టయోటా వాహనాలను మరింత మందికి చేరువ చేయాలన్నదే మా సంస్థ లక్ష్యం.
-బి.రమేశ్, టీం లీడర్, కాకతీయ మోటార్స్