మధిర, డిసెంబర్ 31 : బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును మధిర మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా వారితో మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీ అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు.
శ్రేణులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎంపీ నామాకు కౌన్సిలర్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, అరిగె రజనీ, ధీరావత్ మాధవి, మేడికొండ కళ్యాణి, గద్దల మాధురి, భారతి, పట్టణ పార్టీ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, ముత్తవరపు ప్యారీ, మేడికొండ కిరణ్, గద్దల నాని, తాళ్లూరి హరీశ్‌బాబు, మందాల నాగబాబు పాల్గొన్నారు.