
తల్లాడ : మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు కంచల సతీష్‌శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలతో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.