MLC Elections | బోనకల్ : ఈ నెల 27వ తేదీన ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బోనకల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి, ఎమ్మెల్సీ రూట్ ఆఫీసర్ కడారు విజయ భాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీ పోలింగ్ రోజున ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్‌ను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలింగ్ సజావుగా జరిగేలా పరివేక్షించాలన్నారు. ఆయన వెంట తహసిల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఆర్ ఐ గుగులోత్ లక్ష్మణ్ ఉన్నారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!