ఖమ్మం రూరల్, జనవరి 23 : ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఎండీ మున్వర్ అలీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇంతకాలం ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ జిల్లా హాలియాకు బదిలీ కాగా ఆయన స్థానంలో తిరుమలగిరి మున్సిపాలిటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మున్వర్ అలీ ఏదులాపురం మున్సిపాలిటీకి బదిలీ కావడం జరిగింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌కు పలువురు మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.