ఇల్లెందు, జూలై 5: ఇల్లెందు పట్టణంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ఇల్లెందు పురపాలక సంఘం ప్రత్యేకాధికారి/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన శనివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పనులు, వన మహోత్సవం వివరాలు తెలుసుకున్నారు. కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డీఈ మురళి, ఎంపీడీవో ధన్సింగ్, ఆర్ఐలు శ్రీనివాస్, లాలయ్య పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, జూలై 5: మండలంలో శనివారం అదనపు కలెక్టర్ విద్యాచందన విస్తృతంగా పర్యటించారు. రొంపేడులో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నెలకొల్పనున్న స్థలాన్ని, నాయకులగూడెంలో పౌల్ట్రీ మదర్ యూనిట్ నిర్మాణ పనులను, బొజ్జాయిగూడెంలో మహిళా సంఘ సభ్యుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంపీడీవో ధన్సింగ్, ఎంపీవో చిరంజీవి, ఏపీఎం దుర్గారావు, సీసీ కొమ్మాలు తదితరులు పాల్గొన్నారు.