కొత్తగూడెం అర్బన్, మే 16 : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తామని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రూ.500 చొప్పున రైతులకు బోనస్ చెల్లించాలని మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ తీరును నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం కొనుగోళ్ల విషయంలో తాలు, తూకాల్లో కొర్రీలు పెడుతూ అన్యాయం చేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్, వనమా రాఘవేందర్రావు, ఎంపీపీలు బదావత్ శాంతి, భూక్యా సోనా, పార్టీ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్పాషా, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి శ్రీకాంత్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, పట్టణ, మండల కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.