కారేపల్లి, జూలై 02 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మొహర్రం వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పీర్లను గ్రామాల్లోని వీధుల్లో ఊరేగించగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు. మండల పరిధిలోని గుంపెల్లగూడెం, మాదారం కారేపల్లి క్రాస్ రోడ్, గాజులతండా, రంగురాళ్లబోడు, చీమలపాడు, కారేపల్లిలో గల జామే మసీద్లను ఆయా మసీదుల కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. పీర్లకు ఆయా గ్రామాల్లో భక్తులు పూలు, దట్టీలు సమర్పించారు.
Karepalli : ఘనంగా మొహర్రం వేడుకలు