మధిర, జూలై 30 : ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కిశోర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాలయాన్ని నిశితంగా పరిశీలించిన ఆయన పారిశుభ్రత, వైద్య సదుపాయాలు, ఆహార విషయాల గురించి విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. గురుకుల విద్యాలయానికి సరుకులు సరఫరా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ల సమాచారం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విషయంలో సిబ్బంది పూర్తి అప్రమత్తత కలిగి ఉండాలని, ప్రభుత్వం గురుకులాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అనేక సదుపాయాలు కల్పిస్తుండగా వాటిని పూర్తిగా విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎంపీడీఓ మధ్యాహ్న భోజనం చేశారు.