ఖమ్మం, సెప్టెంబర్ 4 : ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల కోసం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సోమ, మంగళవారాల్లో మున్నేరు లోతట్టు ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించి కొండంత అండగా నిలిచిన విషయం తెలిసిందే.
ముంపు ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు ప్రకటించారు.