ఖమ్మం, ఆగస్టు 14 : అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ) ఇప్పించారు. ఎంపీ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన నిరుపేద దుబ్బాక రవి 22 ఏళ్ల కుమారుడు రణధీర్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎంపీ వద్దిరాజు సిఫార్సు లేఖను అధికారులు పరిశీలించి రూ.2 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. ఆ ఎల్వోసీ పత్రాన్ని రణధీర్ తండ్రి రవికి హైదరాబాద్లో బుధవారం ఎంపీ రవిచంద్ర అందజేశారు. ఎంపీ వద్దిరాజుకు రవి కృతజ్ఞతలు తెలిపారు.