ఖమ్మం, జనవరి 23 : బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్లు ఎంపీ క్యాంపు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి ఖమ్మం జూబ్లీపురలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొంది.
గురువారం జరిగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ మాలోతు కవితతో కలిసి కమిటీ వైస్ చైర్మన్ అయిన ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొని, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై శాఖలవారీగా సమీక్షిస్తారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో జరిగే సమావేశానికి నామినేటెడ్ సభ్యులు, ఎంపీపీలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఎంపీ నామా కోరారు.