ఖమ్మం, డిసెంబర్ 20: దేశవ్యాప్తంగా ఔత్సాహికులు ప్రారంభించిన స్టార్టప్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి? వాటిలో ఎన్నో స్టార్టప్స్ సరిగా నిలదొకుకోలేకపోతున్నాయనేది వాస్తవమేనా? ఒకవేళ అది నిజమైతే స్టార్టప్స్‌ను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే వివరాలను రాష్ర్టాల వారీగా, యూనియన్ టెరిటరీల వారీగా బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు. దీనిపై కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలశాఖ మంత్రి సోమ్ పరాష్ సమాధానమిచ్చారు.
2016 జనవరి 16ను స్టార్టప్ ఇండియాను ప్రారంభించామన్నారు. 2016లో 300కి పైగా ఉన్న స్టార్టప్స్ నేడు 1,14,902కి చేరుకున్నాయన్నారు. వీటిలో గుర్తింపు సాధించిన స్టార్టప్స్ 26,360 ఉన్నాయన్నారు. 2018లో తెలంగాణ గుర్తింపు పొందిన స్టార్టప్స్ 446 ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 1,792 వరకు చేరందన్నారు. స్టార్టప్స్ అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో ఉన్నాయన్నారు. స్టార్టప్స్‌ను ఎస్ఐఎస్ఎఫ్ఎస్, ఎఫ్ఎఫ్ఎస్, సీజీఎస్ఎస్ తదితర పథకాల ద్వారా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకు జాతీయస్థాయిలో ఒక సలహా మండలినీ ఏర్పాటు చేశామన్నారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు.