సత్తుపల్లి, డిసెంబర్ 23: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శనివారం జరిగిన ఉత్తరద్వార దర్శనానికి వారు హాజరయ్యారు. ఉత్తర ద్వారంలో దేవదేవుడిని వారు దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.