హెల్త్ సబ్ సెంటర్ వద్ద తల్లుల నిరీక్షణ
వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో టీకాల కోసం బాలింతలు చంటి పిల్లలతో పడిగాపులు కాసిన ఘటన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు హెల్త్ సబ్ సెంటర్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమ చిన్నారులకు టీకాలు వేయించేందుకు తల్లులు హెల్త్ సబ్ సెంటర్ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు.
- పిల్లలకు టీకాలు వేసే వైద్య సిబ్బంది లేకపోవడంతో పడిగాపులు
- డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేయడంతో టీకాల ప్రక్రియ పూర్తి
తిరుమలాయపాలెం, మార్చి 18 : వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో టీకాల కోసం బాలింతలు చంటి పిల్లలతో పడిగాపులు కాసిన ఘటన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు హెల్త్ సబ్ సెంటర్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమ చిన్నారులకు టీకాలు వేయించేందుకు తల్లులు హెల్త్ సబ్ సెంటర్ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. అక్కడ టీకాలు వేసేందుకు మొదటి ఏఎన్ఎం సరోజినిని అధికారులు నియమించారు. అయితే ఆమెకు కళ్ల మసకలతోపాటు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అఖిల అనే గర్భిణికి ఇంజక్షన్ వేస్తుండగా సిరంజీ విరిగిపోయింది. దీంతో చిన్న పిల్లలకు టీకాలు వేస్తానన్నా మిగతా తల్లులు అందుకు ఒప్పుకోలేదు.
ఈ విషయాన్ని కొందరు తల్లులు డీఎంహెచ్వో రామారావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే పిండిప్రోలు పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సెకండ్ ఏఎన్ఎం ధనమ్మను టీకాలు వేయడానికి వెళ్లాలని ఆదేశించారు. అయితే దీనికి ఆమె నిరాకరించింది. అప్పటికే మధ్యాహ్నం 12:30 గంటలు అవుతున్నా బాలింతలు అక్కడే నిరీక్షించారు. అనంతరం అధికారులు కొక్కెరేణి ఏఎన్ఎంను పిలిపించి చిన్నారులకు టీకాల ప్రక్రియను పూర్తి చేశారు.
ఆరోగ్య ఉప కేంద్రం వద్ద టీకాలు వేసేందుకు సరైన ఏఎన్ఎంను ఎందుకు నియమించలేదని పలువురు బాలింతలు పీహెచ్సీ వైద్యాధికారి అవినాశ్ను ప్రశ్నించారు. ఇద్దరు ఏఎన్ఎంల మధ్య సమన్వయ లోపం వల్ల సమస్య వస్తోందని తెలిపారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఈ ఒక్కసారి కాదని, ప్రతీ వారం ఇదే పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు తెలిపారు. మంత్రి పొంగులేటి ఇలాకాలోనే ఇలా ఉంటే.. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడున్న బాలింతలు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

