కారేపల్లి, జూన్ 30 : రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్ సింగరేణి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) సింగరేణి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్, ఏఓలకు రైతు సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ మండల కార్యదర్శి గుగులోత్ తేజా నాయక్, టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ మాట్లాడుతూ.. యూరియా పంపిణికి మొబైల్ యాప్‌ను రద్దు చేయాలన్నారు. ఏజెన్సీలో భూములకు పట్టాలు లేని రైతులకు యూరియా ఎరువులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని, ఎరువులు విత్తనాలపై అధిక ధరలను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాల్గొవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గొప్పలు చెప్పుకుంటుందన్నారు.
మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతాంగానికి పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) అందించడం లేదన్నారు. వ్యవసాయ ఉత్పాదకాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సెల్ ఫోన్ లేకపోవడం, సెల్ ఫోన్ ఉన్నా వాడడం తెలవకపోవడం, సిగ్నల్ సరిగా లేకపోవడంతో యూరియా యాప్ తో రైతులు నానా ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు కోడెం సీతారాములు, పాయం రవి, గొగ్గిల రాము, ముక్తి రామారావు, గుమ్మడి ప్రసాద్, దోమల రమేష్, చింత విష్ణు, గోగ్గిల సమ్మయ్య, గొగ్గిల రామారావు, డివిజన్ కమిటీ సభ్యులు పుల్లకాని సత్తిరెడ్డి, రావుల నాగేశ్వరావు పాల్గొన్నారు.