ఖమ్మం, మార్చి 21: శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అద్భుతంగా ప్రసంగం చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం శాసనసభ ఆవరణలో హరీశ్‌రావును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, బడ్జెట్ కేటాయింపుల్లోని డొల్లతనాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను అసెంబ్లీలో లేవనెత్తినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.