ఖమ్మం, జనవరి 5: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతో ప్రజలకు సేవలు అందిస్తున్నానని, పార్టీ శ్రేణులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. ఎమ్మెల్సీ పదవీకాలం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడిగా, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనపై ఆదరాభిమానాలు చూపుతున్న ప్రతిఒకరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు తాతా మధుకు శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఖమ్మం జిల్లా యువజన నాయకుడు బలుసు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు.
ముదిగొండ మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, పార్టీ మండల అధ్యక్షులు భాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, తాళ్లూరి జీవన్‌కుమార్, లీగల్ సెల్ బాధ్యులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు బిచ్చాల తిరుమలరావు, తెలంగాణ ఉద్యమకారులు పగడాల నరేందర్, కోడిరెక ఉమాశంకర్, నెమలికొండ వంశీ, పార్టీ నాయకులు ముత్యాల వెంకటప్పారావు, బంక మల్లయ్య, శంకర్, భిక్షమయ్య, సద్దాం షేక్, చావా శ్రీనివాస్, మద్దెల విజయ్, యూత్ నాయకులు షారుక్, పోట్ల నితీష్, విద్యార్థి విభాగం మునాఫ్ పాల్గొన్నారు.