బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలి
ఖమ్మం నగరంలో 12ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం ఖమ్మం నగరంలో పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
- బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
- ఖమ్మం సీపీకి బీఆర్ఎస్ బృందం వినతిపత్రం అందజేత
మామిళ్లగూడెం, జూన్ 12 : ఖమ్మం నగరంలో 12ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం ఖమ్మం నగరంలో పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిన ఈ ఘటనలో బాలికకు తక్షణమే న్యాయం చేయాలని, నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికదాడుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని, బాలికకు ప్రభుత్వం తరఫున అవసరమైన వైద్య, ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరి ఉద్యోగ భద్రత తక్షణమే కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, అపార్ట్మెంట్స్, ఇతర ప్రాంతాల్లో బాలికలు, మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న, నాయకులు రెంటాల ఆనంద్, దుర్గయ్య, బలుసు మురళీకృష్ణ, లింగనబోయిన సతీష్, మహ్మద్ రఫీ, పగడాల నరేందర్, యలమద్ది రవి, గవర్రాజు శంకర్రాజు, పటేటి సాయి, పోలూరి రామ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

