ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికల నామినేషన్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు. నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించామన్నారు. నలుగురు అభ్యర్థుల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మధుసూదన్ తాతా, కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణిలు ఉన్నారని పేర్కొన్నారు.
నామినేషన్ కోసం అభ్యర్థులు సమర్పించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఎన్నికల నోడల్ అధికారులు కే.శ్రీరామ్, శైలేంద్ర, మదన్‌గోపాల్, అభ్యర్థులు తాతా మధుసూదన్, రాయల నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.