భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 13 : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉక్కు మహిళ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కవిత జన్మదిన వేడుకలను కొత్తగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవిత కీలక పాత్ర వహించారన్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచం నలుమూలల చాటిచెప్పిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వాటిని ఎదుర్కొంటూ ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇటువంటి జన్మదిన వేడుకలను ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ భుక్యా సోనా, మాజీ కౌన్సిలర్ రుక్మైందర్ బండారి, ఉర్దూగర్ కమిటీ మాజీ చైర్మన్ అన్వర్ పాషా, టీబీజీకే నాయకులు కాపు కృష్ణ, కూసాని వీరభద్రం, మాజీ కోఆప్షన్ సభ్యులు దుడల బుచ్చయ్య, ఆరిఫ్ ఖాన్, మాజీ సర్పంచ్ మోతి, మాజీ ఉప సర్పంచ్ దుర్గేశ్, మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ (సంపు ), పాల్వంచ పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
Vanama Venkateswara Rao : ఉక్కు మహిళ ఎమ్మెల్సీ కవిత : మాజీ మంత్రి వనమా