ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగరేసింది. ఇక్కడ గులాబీ పార్టీ అభ్యర్థి తాత మధు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపాందారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి.
మిగతా వాటిలో టీఆర్ఎస్కు 480, కాంగ్రెస్కు 242 ఓట్లు పోలవగా.. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లే వచ్చాయి. కాగా, నల్లగొండలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.