కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 4 : రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలని, ప్రతీ ఏడా ది దసరా కానుకగా అందించే బతుకమ్మ చీరెలను కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నా రు. గురువారం కొత్తగూడెం క్లబ్లో ఆయన మహిళలకు బతుకమ్మ చీరెలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలను దీవించి వారు పండుగను ఆనందం గా జరుపుకోవాలనే లక్ష్యంతో చీరెలను అందించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నా రు.
అన్ని మతాలను, కులాలను సమానంగా చూ స్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రంజాన్‌కు ముస్లింలకు, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు దుస్తులు అందించి మానవత్వమున్న ప్రభుత్వం అని నిరూపించుకుందని తెలిపారు. ప్రతి మహిళలకు చీరెను అందిస్తామని, వార్డు పరిధిలోని రేషన్‌డీలర్ల వద్ద ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్‌కార్డు తీసుకొని వెళ్లి బతుకమ్మ చీరెను తీసుకోవచ్చన్నారు. అంతకుమందు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ, డప్పులతో ఎమ్మెల్యే వనమాకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, కౌన్సిలర్లు, మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.